Thursday, August 7, 2025

కెసిఆర్ ముందుచూపు వల్లే తెలంగాణ ఏర్పడింది: మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నిఘా న్యూస్:మాజీ మంత్రి కేటీఆర్ పంజాగుట్ట లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ పంజాగుట్ట సర్కిల్​కి అంబేడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నా రు. ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజునే ఆవిష్కరించుకోవ టం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

సచివాలయానికి అంబే ద్కర్ పేరుపెట్టిన ఘనత కేసీఆర్కె దక్కిందన్న మాజీ మంత్రి తారకరామారావు.. పార్లమెంట్​కి సైతం అంబేద్కర్ పేరు పెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి నాయకత్వం లో భారత దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని మన ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. 125 ఫీట్ల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర సచివాలయంలో కూర్చున్న వారికి రాబోయే దశాబ్దాలు, శతాబ్దాల పాటు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని నెలకొల్పాము.

అంబేడ్కర్ ప్రవచించిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే దానిని ఒంటపట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఆవిశ్య కత వివరిస్తూ, బోధిస్తూ.. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ.. అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలి. ఆయన రాసిన ఆర్టికల్-3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular