కరీంనగర్, నిఘా న్యూస్: భూ ఆక్రమణ కేసులో గజ్వేల్ తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి లో ఆయన పనిచేసినప్పుడు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినందుకు ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. గతంలో భూ ఆక్రమణలకు పాల్పడినందుకు కరీంనగర్ శివారులోని సీతారాంపూర్ కు చెందిన వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా 9 మంది పరారీలో ఉన్నారు. ఇందులో ఏ1 నిందితుడిగా చిల్ల శ్రీనివాస్ ను అతని బినామి చంద సంతోష్ ను ఏ2 నిందితుడిగా చేర్చారు. ఇతను అప్పటిక కొత్తపల్లి ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్ఏ గా పనిచేశారు. ప్రసత్తం తూంకుంటలోని మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.
భూ ఆక్రమణ కేసులో తహసీల్దార్ అరెస్ట్..
RELATED ARTICLES