హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జూన్ సెషన్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం అభ్యర్థులలో 33.98 శాతం మాత్రమే అర్హత సాధించినట్లు వెల్లడించారు.
ఈ సంవత్సరం టెట్ జూన్ సెషన్ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. ప్రాథమిక ఫలితాలను ఇప్పటికే జూలై 5న ప్రకటించిన సంగతి తెలిసిందేపేపర్ 1కు మొత్తం 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15 వేల మంది ఉన్నారు.పేపర్ 1 పరీక్షకు: 74.65% మంది హాజరయ్యారు. పేపర్ 2 గణితం, సైన్స్,73.48% హాజరు. పేపర్ 2 సామాజిక అధ్యయనాలు 76.73% హాజరు నమోదు అయింది. ఫలితాల ప్రకటనతో అభ్యర్థులు తదుపరి దశలకు సిద్ధమవుతున్నారు