రాంగోపాల్ వర్మ సినిమాల్లోమరోసారి వాయిదాపడ్డాయి. ఆయన తీసిన వ్యూహం, శపథం అనే పేర్లతో వస్తున్న సినిమాలో ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా ఉన్నాయని, ఇవి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలువెల్లువెత్తుతున్నాయి. దీంతో టీడీపీ నేత నారా లోకేశ్ తమ గురించి ఆయా సినిమాల్లో తప్పుగా చూపించారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గత డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలో ఫిబ్రవరికి వాయిదా పడ్డాయి. దీంతో 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని సాంకేతికకారణాల వల్ల సినిమాలను వాయిదా వేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. దీంతో మార్చి 1న వ్యూహం, 8న శపథం రిలీజ్ అవుతాయని చెప్పారు.
వ్యూహం, శపథం సినిమాలు మరోసారి వాయిదా
RELATED ARTICLES