హైదరాబాద్, నిఘా న్యూస్:తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రసూల్ పురా అన్నా నగర్‌లోని పలు చికెన్ సెం టర్లపై శుక్రవారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు.
అన్నానగర్‌లోని ఓ చికెన్ దుకాణంపై ఫిర్యాదు అందగా.. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికా రులు వెంటనే దాడులు జరిపారు.
ఎస్‌ఎస్‌ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ సెంటర్ లాంటి దుకాణాలపై దాడులు చేసి.. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కు వ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
మూడు నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతు న్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికా రులు చెప్పారు. చికెన్ పాడవకుండా ప్రమాదకర మైన ఫార్మలిన్ కలుపుతు న్నట్లు నిర్ధారించారు.
బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారుల గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కుళ్లిన చికెన్‌ను పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్సు రద్దు చేసి.. వ్యాపారులపై కేసు నమోదు చేశారు.