ఫుట్ పాత్ పై తొలగించిన రెలింగ్ పునరుద్ధరించిన అధికారులు..
కరీంనగర్ (నిఘా న్యూస్) :- కరీంనగర్ 59వ డివిజన్ పరిధిలోని శివ టాకీస్ లేబర్ అడ్డా సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు నిర్వాహకులు తమ వ్యాపారానికి అడ్డుగా ఉందని స్మార్ట్ సిటీలో భాగంగా ఫుట్ పాత్ పై వేసిన రెలింగ్ ను తొలగించారు.కాగా నిఘా న్యూస్ వరుస కథనాలను ప్రచురించడంతో ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు స్పందించి తీసివేసిన రెలింగ్ ని మళ్ళీ పునరుద్ధరించారు.ఇక్కడి వరకు బాగానే ఉంది కాని రెలింగ్ తొలగించిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్న అధికారులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వైన్స్ పక్కనే ఉన్న ట్రూ వాల్యూ మారుతి సుజుకి షో రూమ్ ముందు కూడా రెలింగ్ ను తొలగించారు.అక్కడి వరకు వెళ్లిన అధికారులకు తొలగించిన రెలింగ్ కనిపించకపోవడం గమనార్హం.ఏదిఏమైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నాయ..? లేక ముడుపులు ముడుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రెలింగ్ ను తొలగించి ఫుట్ పాత్ ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
