Saturday, August 2, 2025

సూసైడ్.. సస్పెన్షన్!

రూ. 25 లక్షల జప్తు కేసులో అనేక మలుపులు

కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

సమాచారమిచ్చిన వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి(నిఘాన్యూస్) : ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో దొరికిన డబ్బు వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తా లో బైక్ పై వెళ్తున్న సాయి కుమార్, కార్తీక్ ల దగ్గర బ్యాగులో రూ. 25 లక్షల నగదును గుర్తించారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శ్రీకాంత్ రెండు

గంటల తర్వాత రూ. 18.50 లక్షలు తనిఖీల్లో దొరికినట్లు ఇన్ స్పెక్టర్ వెంకటయ్యకు వివరిం చారు. అయితే మొత్తం రూ.25 లక్షల నగదు ఉందని, రూ. 6.50 లక్షలు కానిస్టేబుళ్లు దాచి పెట్టారని సాయికుమార్, కార్తీక్ లు ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన తర్వాత రూ.6.50 లక్షలను రికవరీ చేసి శ్రీకాంత్ యాదవ్, కృష్ణలను అదే రోజు సస్పెండ్ చేస్తూ సీపీ తరుణ్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.

భయంతో ‘ఇన్ఫార్మర్’ సూసైడ్

కాగా, బైక్ పై రూ. 25 లక్షలు తీసుకెళ్తు న్నట్లు పోలీసులకు ఎలా తెలిసిందని ఆరా తీస్తుండగా.. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చర్లపల్లికి చెందిన రంజిత్ భయంతో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సాయికుమార్, కార్తిక్, రంజిత్ ఒకే దగ్గర పని చేస్తున్నట్లు తెలిసింది. అయితే సాయికుమార్, కార్తీక్ డబ్బు తీసుకెళ్తున్న సమాచారాన్ని రంజిత్ పోలీసులైన శ్రీకాంత్ యాదవ్, కృష్ణలకు చేరవేశాడు. పట్టుకుంటే వాళ్లు మొత్తం డబ్బు విడిచిపెట్టే అవ

కాశముందని చెప్పాడు. అయితే పోలీసులు డబ్బును సీజ్ చేశాక.. సాయి కుమార్, కార్తీక్ లు యజమానికి ఫోన్ చేసి.. డబ్బు తీసుకెళ్తున్న విషయాన్ని రంజిత్ పోలీసులకు చేరవేశాడని చెప్పినట్లు తెలిసింది. దీంతో యజమాని రంజిత్ ను నిలదీయగా, అతను ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసు చర్లపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అయితే ఆ డబ్బు ఎవరిది అనే దానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు వాటి పూర్తి వివరాలు కూడా వెల్లడిం చాల్సి ఉన్నది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular