Monday, August 4, 2025

విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం, నిఘా న్యూస్: విశాఖ మధురవాడ కొమ్మది లో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ చోటు చేసుకుంది.ఈ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కు దారితీసింది. ఈ సంఘటన సంచలనం రేపింది. ఇటీవల కాలంలో వరుసగా విశాఖ మధురవాడలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్య లు,అత్యాచారాల సంఘట నలు నిత్యకృత్యంగా మారా యి. ఇటీవల ఒక విద్యార్థిని పై పిటి మాస్టర్ అత్యచారం సంఘటన మరవకముందే తాజాగా మరో సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మధురవాడ ఒక విద్యా సంస్థలో దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ తీవ్ర లైంగిక వేధింపుల సంఘట నలో తన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని ఒక అమాయక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్య చేసుకుం టూ ముందుగా వాట్సప్ చాటింగ్ ద్వారా సూసైడ్ నోట్ రాసింది. తనకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలో తాను చదువుకుంటున్న కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పించవ లసిన ఫ్యాకల్టీ విద్యార్థులతో చేతులు కలిపి లైంగిక వేధిం పులకు పాల్పడినట్లు పేర్కొంది. తనలాగే అనేకమంది మహి ళా విద్యార్థులు లైంగిక వేధిం పులకు నిత్యం బలి అవుతు న్నారని తెలిపింది. పోలీసు లకు ఫిర్యాదు చేస్తే రహస్యం గా తీసిన ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ విద్యార్థిని కుటుంబ పరువును బజారుకీడుస్తా మని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈ ఘటన ఒక్కసారిగా వెలుగు చూడడం తో విద్యార్థులు,తల్లిదండ్రులు భయాందోళనకు గుర య్యారు. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యా యులే కీచకులుగా మారుతుంటే తల్లిదండ్రుల్లో తమ పిల్లలు పై ఆందోళన మొదలియింది. మృతురాలు తనకు జరిగిన బాధ ను తన తల్లిదండ్రు లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించి శుక్రవారం తెల్లవా రుజామున కళాశాల బిల్డింగ్ పై దూకి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular