Saturday, August 9, 2025

ప్రశాంత్ నగర్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

కరీంనగర్, నిఘా న్యూస్:శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలో రామనామ స్మరణ తో మార్మోగాయి. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం హాజరయ్యారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయాల్లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రశాంత్ నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్ హాజరై అర్చకుల నుంచి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారికి మొక్కలు చెల్లించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular