Sunday, August 3, 2025

గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలి

సంగారెడ్డి ప్రతినిధి (నిఘా న్యూస్): గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామ పాలనకు సంబంధించి అన్ని విషయాలపై అవగాహనతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు కొత్త పనిని సంతోషంతో చేయాలన్నారు. కొత్త విధులలో భాగంగా విలేజ్ విజిట్ చేయాలని,గ్రామం మొత్తం నడుచుకుంటూ తిరిగితే గ్రామ పరిస్థితి తెలుస్తుందని, ఏ పనులు చేయాలి, ఏ సమస్యలు వున్నాయి అన్నది అర్థమవు తుందన్నారు.అప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని, ఆయా గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరుగుదొడ్లు శుభ్రం చేయించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీల నన్నారు.గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డు కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామపంచాయతీలో గల సెగ్రిగేషన్ షడ్స్ వినియోగంలోకి తీసుకురావాలన్నారు.పొడి చెత్త అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టా లన్నారు. ముఖ్యంగా ఎక్కడా గ్రామాలలో తాగు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 31 లోపు వంద శాతం ఆస్తి పన్ను వసూళ్లు కావాలని సూచించారు. ఆయా గ్రామ పంచాయితీ లో గల పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకాధికారి సందర్శించి,కనీస మౌలిక సదుపాయాలు వున్నది,లేనిది పరిశీలించి,అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కమ్యూనిటీ అసెట్స్ పై దృష్టి సారించాలని, మంజూరైన పనులు పూర్తి చేయించాలని, ప్రారంభం కాని పనులు ప్రారంభించాలని తెలిపారు.గ్రామ సభలు సజావుగా నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు శిక్షణ లో భాగంగా పంచాయతీ రాజ్ ఆక్ట్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల విధులు,బాద్యతలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,డి పి ఓ సురేష్ మోహన్,జెడ్ పి సి ఈ ఓ ఎల్లయ్య,
డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు,గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులు,
తదితరులు, పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular