Sunday, March 1, 2026

చొప్పదండి నియోజకవర్గం లో మార్పు తప్పదా..?

ప్రతి ఏటా ఎమ్మెల్యేను మార్చుతున్న ప్రజలు
రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ను ఇదే తంతు కొనసాగనుందా..

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ సమీపంలోని చొప్పదండి నియోజకవర్గం లో ఓటర్లు పత్తి అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేను మార్చడం పరిపాటిగానే మారింది. ప్రతి ఏటా కొత్తవారిని ఎన్నుకోవడం ఇక్కడి ప్రజలకు వారి పాలన తీరుపై అసంతృప్తి కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కానరాకపోవడంతో ప్రతిసారి ఓటర్లు కొత్త నాయకున్ని ఎన్నుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ను ఇదే తీరు రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే రిపీట్ అవుతే రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. అయితే అధికారం ఎవరికి వస్తుందో వారే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం పరిపాటిగా మారింది. గతంలో ఎమ్మెల్యేగా బొడిగె శోభ బిఆర్ఎస్ నుంచి ఎన్నిక కాగా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తరువాత సుంకే రవిశంకర్ బిఆర్ ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అప్పుడు సైతం అధికారంలో ఆ పార్టీ ఉంది. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం సైతం అధికారంలో ఉన్న పార్టీయే. ఇలా ప్రజలు ఇక్కడివారిని ఎన్నుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు వేచి చూడాలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular