వేములవాడ మార్చి 17 (నిఘా న్యూస్):అంతా శివమయం.. వేములవాడంత ఆనందమయం.. హర హర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమశ్శివాయ.. ఓం నమశివాయ.. అంటూ ప్రతి భక్తుని నోట ప్రతి చోటా వేములవాడ మొత్తం మార్మోగింది. సాధారణంగా ఒక కుటుంబంలో వివాహం జరిగితే ఆ వివాహానికి సంబంధించిన కొంత మంది శ్రామికులు లబ్ధి పొందుతారు కానీ ముక్కంటి ఈశ్వరుని వివాహం వేడుకల్లో వేములవాడ ఎంతోమందికి ఉపాదికి మార్గం కాగా.. ఎందరో భక్తుల ఆనంద నిలయంగా వేములవాడ ఆలయ పరిసరాలన్నీ భక్తి లో లినమయ్యాయి నా ని అనే భేదం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి వివాహానికి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ప్రతి ఏటా జరిగే శివ కళ్యాణ మహోత్సవానికి ఆశేష జనవాహిని రావడం ఇక్కడ వేములవాడ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగయి. ప్రతి అమ్మ ఆ దేవుని రూపాన్ని తనలో మలుచుకుని స్మరించుకుంటూ శివయ్య నీవే మాకు అండదండ అంటూ శివయ్యను వేడుకుంటూ శివయ్య నీ కళ్యాణం ప్రతి ఇంట వైభోగం వసంతం వెళ్లి విరిసేలా నిలుస్తుందిని కోరిన కోర్కెలు తీర్చే తండ్రి నీ దయ ఉంటే ప్రతి ఇంటా ప్రతిచోట ఆనందాల పండుగ ఆపదలు తొలగి ఆయురారోగ్యాలు సమకూరుతాయని శివపార్వతుల వివాహ వేడుక లో పాల్గొన్న ప్రతి భక్తుని అంతరంగం అదే తలుస్తుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించి పులకించారు ఈసారి కనివిని ఎరగని రీతిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాదేవుని దీవెనలు ఆ పార్వతి పరమేశ్వరుని ఆశీర్వాదాలు అక్షింతలు ఒకరినొకరు చల్లుకుంటూ శివయ్య నీవేనయ్యా పార్వతమ్మ నీవే తల్లి మా దైవం అంటూ ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. వేములవాడలో జాతరను తలపించేలా శివ కళ్యాణం వేడుకలు జరగగా ఆ వేడుకల్లో ఎంతోమంది వివిధ ప్రాంతాల నుండి వ్యాపారస్తులు చిరు వ్యాపారులు తమ వ్యాపారం చేసుకోగా రెక్కాడితే కాని డొక్కాడని జీవులకు శివపార్వతులు వేసుకొన్న అక్షింత లె రేపటి పుటకి అవసరం అన్నట్లు బడుగుజీవులకు సైతం స్వామివేడుకలో నేలపై రాలిన అక్షింతలు సేకరించుటుకోవడం చూస్తుంటే ఏదో ఒకరకంగా దేవదేవుడు అందరి కడుపు నింపుతాడని అక్షింతలు సెకరించే వారిని చూసిన భక్తులు అనుకొనడం జరిగిందంటే వేములవాడ లో శివ కళ్యాణం వేడుకలు అంత ఘనంగా జరిగాయి.
