హైదరాబాద్, నిఘాన్యూస్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.నిన్న గవర్నర్ తో సమావే శమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టా నంతో చర్చలు జరిపారు.రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ కల్గిస్తోంది.
మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా, మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. సామాజిక సమీకర ణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమలకు ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం…