ఇరువురిపై కేసు నమోదు.
అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
ఇల్లంతకుంట ఎస్సై రాజకుమార్.
జమ్మికుంట, ఏప్రిల్ 12 (నిఘా న్యూస్)ఇల్లంతకుంట మండల పరిధిలోని వాగొడ్డు రామన్నపల్లి గ్రామ శివారులో ఇల్లంతకుంట పోలీసులు హుజురాబాద్ సబ్ డివిజన్ స్పెషల్ టీం నిర్వహించిన వాహన తనిఖీల్లో నడికూడ మండలం వెంకటేశ్వర పల్లె గ్రామానికి చెందిన చిప్ప మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 5020 రూపాయల విలువైన 11 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లతకుంట ఎస్ఐ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మండలంలోని మల్యాల గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా మర్రిపల్లి గూడెం కు చెందిన కుసుంబ రమేష్ అనే వ్యక్తి అక్రమంగా 9700 విలువైన దాదాపు 23 లీటర్ల మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అతడిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మద్యాన్ని సరఫరా చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ తనిఖీలలో ఇల్లంతకుంట పోలీసులతోపాటు హుజరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.