కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్
పెద్దపల్లి, ఏప్రిల్ 26 (నిఘా న్యూస్): జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమీక్షా మందిరం లో కలెక్టర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా అదనపు కలెక్టర్ లు జే అరుణశ్రీ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.కలెక్టర్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ధర్మారం మండలంలోని యాభై పోలింగ్ కేంద్రాల సిబ్బందిని ఇక్కడి నుండి కేటాయించడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి రెవెన్యూ జిల్లాలో మొత్తం ఏడు వందల అరవై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటికి ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓపిఓ లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు ప్రకారం ఇరవై శాతం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రెండు వందల తొంబై పోలింగ్ కేంద్రాలకు మూడు వందల నలభై రెండు పోలింగ్ బృందాలను రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న రెండు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలకు మూడు వందల రెండు పోలింగ్ బృందాలను మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న నూట అరవై పోలింగ్ కేంద్రాలకు నూట ఏనాబై ఎనిమిది పోలింగ్ బృందాలను ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ధర్మారం మండలంలో ఉన్న యాభై మూడు పోలింగ్ కేంద్రాలకు అరవై రెండు మంది పోలింగ్ బృందాలను పారదర్శకంగా ఎన్.ఐ.సి. సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు హనుమా నాయక్ బి.గంగయ్య మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ డీఈవో మాధవి ఎన్ఐసి ఉపసంచాలకులు అనిల్, సిబ్బంది అజీమ్ ఈడియం కవిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.