హైదరాబాద్, నిఘాన్యూస్: ప్రభుత్వ కళాశాలల్లో చది వే ఇంటర్ విద్యార్థులకోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి సర్కార్‌కు కీలక ప్రతిపాదనలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పథకాలను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.
వీటిల్లో 1.72లక్షల మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మీషన్లు పెరిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోలిస్తే 11వేల అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు మరింతగా పెంచేందుకు ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వాకి కీలక ప్రతిపాదనలు చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో చదువుతు న్న దివ్యాంగులకు ట్రాన్స్ జెండర్లుకు అండగా నిలవ డంతో పాటు.. ప్రతిభావం తులైన విద్యార్థినులకోసం ఇంటర్ విద్యాశాఖ రెండు కొత్త స్కీంలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చింది. రేవంత్ సర్కార్ సైతం అందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పథకాలు అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది.
అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన స్కూటీ లను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నా రు. తద్వారా విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుం డా కాలేజీలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తొలుత వెయ్యి మంది విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదిందించి.
ఒక్కో వాహనానికి రూ. 50వేల చొప్పున మొత్తం రూ.5కోట్లు కేటాయించా లని ప్రభుత్వాన్ని కోరింది. వీరితోపాటు ట్రాన్స్ జెండర్ విద్యార్థులకూ ఈ స్కీంను వర్తింపజేయాలని అధి కారులు భావిస్తున్నారు. సర్కార్ కాలేజీల్లో మెరిట్ విద్యార్థినులకోసం కొత్తగా స్కాలర్ షిప్ స్కీం తీసుకు రావాలని ఇంటర్ విద్యా శాఖ ఆలోచన చేస్తోంది.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు ఉన్నత విద్యను మధ్యలో నే ఆపేకుండా ప్రోత్సహించ డమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా.. టెన్త్‌లో వచ్చే మార్కుల ఆధారంగా 40వేల మందికి రూ.2500 చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకు 10 కోట్ల బడ్జెట్ కావాలని ఇంటర్ విద్యాశాఖ రేవంత్ సర్కార్ కు ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ రెడ్డి సర్కార్..
ఇప్పటికే ఈ పథకాల అమలుకు సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈ పథకాలు వచ్చే విద్యా సంవత్సరంలో అమలు అవుతాయని అధికారులు తెలిపారు.


