హైదరాబాద్, నిఘా న్యూస్: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. యాపిల్ తదుపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీవోవోగా, భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్‌ను నియమించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. ఆ బాధ్య తలను ప్రస్తుత యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబీహ్ ఖాన్ ఈనెల చివర లో స్వీకరించనున్నారు.
ఇక డిజైనింగ్ టీమ్ బాధ్యతలను సంస్థ సీఈవో టిమ్ కుక్ స్వీకరించనున్నా రు. ఈ విషయాన్ని టెక్ పత్రిక ది వెర్జ్ వెల్లడించింది. భారత మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న సబీహ్ ఖాన్‌కు సంస్థలో 30 ఏళ్ల అనుభవం ఉంది.
గత ఆరేళ్లుగా యాపిల్ గ్లోబెల్ సప్లై ఛైన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉత్పత్తి కార్యకలాపాలనూ పర్యవేక్షిస్తున్నారు. సబీహ్ ఖాన్ భారత సంతతికి చెందినన వ్యక్తి. ఆయన ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్ గ్రేడ్ వరకు చదువుకున్నారు.
ఆ తర్వాత సబీహ్ ఖాన్ కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికాకు వెళ్లారు. టఫ్ట్స్ యూనివ ర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఆ తర్వాత రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. తర్వాత జీఈ ప్లాస్టిక్స్‌లో డెవలప్మెంట్ ఇంజినీర్, అకౌంట్ టెక్నికల్ లీడర్‌గా విధులు నిర్వహించారు.