Wednesday, August 6, 2025

నేడు పార్లమెంటులో జమిలి ఎన్నికలపై సమీక్ష

హైదరాబాద్, నిఘా న్యూస్:జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ మంగళవారం నిపుణులతో భేటీ కానుంది, జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్ల మెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.

ఇక త్వరలోనే పార్లమెంటరీ కమిటీ వైబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్ సైట్ అందుబాటులోకి రానుంది. అన్ని భారతీయ భాషల్లో వెబ్‌సైట్‌ను అందుబాటు లోకి తీసుకొచ్చేందుక కమిటీ కసరత్తు చేస్తోంది.

నేటి జేపీసీ సమావేశంలో జస్టిస్ హేమంత్ గుప్తా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ ఎస్.ఎన్. ఝా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, డా. జస్టిస్ బి.ఎస్. చౌహాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,తోపాటు….

21వ లా కమిషన్ చైర్మన్, డా. అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది సమావేశం కానున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకేసారి జమి లి ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది.

దీంతో మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇది చట్టం కాబోతుంది. ఇందుకోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే.. ఇకపై ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular