పాలకుర్తి, నిఘా న్యూస్: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో
వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, మార్చి 7 నుంచి 11 రకు జరిగే సోమనాథుడి జాతరకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలి అన్నారు. అనంతరం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి మహా జాతర క్యాలేడర్ ని ఆవిష్కరించారు, ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి
ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో మహాశివరాత్రి జాతర జరగాలి అన్నారు, అధికారులు అందరూ అందుబాటులో ఉండి ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు, జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.
మహా శివరాత్రిబ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష సమావేశం
RELATED ARTICLES