Sunday, August 3, 2025

రేవంత్ రెడ్డి ప్రిపేర్ కావడానికి 72 గంటల సమయం ఇస్తున్న: మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నిఘాన్యూస్:తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పండగ చేసింది ఎవరో తెలంగాణ ప్రజల అందరికీ తెలుసు.. తెలిసీ తెలియనట్టు నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు నేను రెడీ అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు.రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామా జిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణలో 70శాతం మంది రైతులే. వారికోసం 18నెలల్లో రైతు భరోసా, రైతు బీమా, గిట్టుబాటు ధర, పంట రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ తదితర పథకాల ద్వారా రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రైతు రాజ్యమని నిరూపించామని అన్నారు.

రైతులకు అండగా నిలిచిం ది ఎవరో పార్లమెంట్లోనైనా, అసెంబ్లీలోనైనా చర్చ పెడదాం. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ ఎవరు చర్చకు వస్తారో రండి అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు.కేటీఆర్ ప్రతిసవాల్..కేసీఆర్‌ని ఎదుర్కునే సీన్ నీకు లేదు కానీ..

మేము నీకు చాలు. ఏ సెంటర్ అయినా ఏ అడ్డాకైనా ఎక్కడికైనా వస్తాం. రేవంత్ రెడ్డి, సవాల్‌ను నేను స్వీకరిస్తున్న. తెలంగాణ ప్రజలకు వ్యవసాయంలో ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ. 8వ తేదీన సోమాజిక గూడ ప్రెస్‌క్లబ్ లో చర్చ పెట్టుకుందాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ కు రావాలని కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు.

ఎక్కడైనా చర్చకు మేము రెడీ. కానీ, ప్రిపేర్ కావడానికి సీఎం రేవంత్ రెడ్డికి 72గంటల సమయం ఇస్తున్నాను. రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి అయిన, కొడంగల్ అయిన, చింతమడక అయినా నేను రెడీ. తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్. చేతగాని రేవంత్ ప్రభుత్వం రైతులను కాల్చుకు తింటోంది అన్నారు.

ఎరువులు కూడా ఇవ్వడం చేతగాని రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను చర్చకు రమ్మంటావా..? రైతు బీమా ఎగ్గొట్టింది కాంగ్రెస్.. బనకచర్ల ద్వారా గురువు చంద్రబాబు నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తుంటే ఎలా సహకరిస్తున్నావో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ విమర్శించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular