కరీంనగర్ అక్టోబర్ 15(నిఘా న్యూస్):కరీంనగర్ పట్టణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణవాసులు జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శ్రీను తో పాటు పలువురు భక్తులు అమ్మవారి మాల విరమణ చేశారు ఎంతో అంగరంగ వైభవంగా వివిధ వార్డుల్లో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అందులో భాగంగా విశిష్టమైన దసరా నవరాత్రులలో చాలామంది ఎంతో భక్తితో అమ్మవారి మాలధారణ చేసుకుంటారు ఎంతో నియమ నిష్టలతో తొమ్మిది రోజులు ఏకభుక్త భోజనం చేస్తూ పాలు పళ్ళు సేవిస్తూ కఠినమైన దీక్షను ప్రారంభిస్తారు ప్రతిరోజు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఆమె దీవెనలు పొందుతారు దసరా పర్వదినాలు పురస్కరించుకొని చాలామంది అమ్మవారి భక్తులు దసరా పండుగ రోజు మాల విరమణ చేస్తారు కొంతమంది భక్తులు దసరా తర్వాత రోజులలో మాల విరమణ చేస్తారు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి మాలధారణ చేయడం వాళ్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని అమ్మవారి భక్తులు అన్నారు
అమ్మవారి మాల విరమణ
RELATED ARTICLES


