కఠిన ఉపవాస దీక్ష చేయడం ముస్లింలకే సాధ్యం.
ప్రముఖ డాక్టర్ జి వంశీకృష్ణ.
జమ్మికుంట, ఏప్రిల్ 11 (నిఘా న్యూస్):మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ అని జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ జి వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణానికి చెందిన ముస్లిం నాయకుడు తాజ్ ఇంటికి తేనీటి విందుకు హాజరైన సప్తగిరి హాస్పిటల్ డాక్టర్ జి వంశీకృష్ణ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరించడం అది వారికే సాధ్యమని ఒకవైపు ఎండలు మండుతున్న కనీసం ఒక చుక్క నీరు కూడా తాగకుండా కఠిన నియమాలతో వారు పవిత్రంగా ఉపవాసం ఉండి రంజాన్ మాసంలో తమ భక్తిని చాటుకుంటారని ఇది అభినందనీయమని ఆయన అన్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆ అల్లా మంచిగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సిరిసేటి అశోక్ కుమార్ గౌడ్ ముస్లిం నాయకుడు తాజ్ ఉన్నారు.