కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్ కట్టరాపూర్ లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతికుమార్ గారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కామారపు ప్రసాద్ మరియు సంపత్ గార్లు విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పండుగ విశిష్టతను మరియు పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ పండుగ రోజున అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్లు ఒకరికొకరు రాఖీ కట్టుకొని, ఆడబిడ్డలు అందరూ వారి సోదరులను ఆశీర్వదించుకుంటూ నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష,మనిద్దరం మన దేశానికి, ధర్మానికి, సంస్కృతికి రక్ష అని అనుకుంటూ రక్షబంధనం జరుపుకోవాలని వివరించారు. అలాగే పాఠశాలలో కూడా బాలబాలికలందరూ సోదర సోదరీమణుల భావంతో మెలగాలని, ఒకరికొకరు ఏ విషయంలోనైనా సోదర సోదరీమణుల భావంతోనే పరస్పరం సహకరించుకోవాలని వివరించి బాల బాలికలందరికీ రాఖీ కట్టించడం జరిగింది.

ప్రతి సంవత్సరం పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటామని మరియు ఈ రాఖీ పౌర్ణమి విశిష్టతను, ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలిసే విధంగా పురాణ కథలను నాటకాల రూపంలో ప్రదర్శించి విద్యార్థులందరికీ తెలపడం జరుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతి కుమార్ గారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని – విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.