గార్ల సెప్టెంబర్ 16 (నిఘా న్యూస్): విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని (సీజీఆర్‌ఎఫ్) వరంగల్ చైర్మన్ ఎస్ .వి వేణుగోపాల చారి అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మంగళవారం గార్ల డోర్నకల్ కురివి కొత్తపేట సీరోల్ మండలాల విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వందమంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందగా వాటిని స్వీకరించారు ఎక్కడ సమస్య వచ్చినా, విద్యుత్ సరఫరా నిలిచిపోంతోందని అన్నింటికి ప్రత్యేక లైన్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యలను అప్పటికప్పుడే విచారించి పరిష్కరించారు వినియోగదాల నుండి వచ్చిన సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డిఈలను ఆదేశించారు అధికారులు విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాజీపడేది లేదన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు ఆగిపోవడం, కాలిపోవడం, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసులు, అదనపులోడు ఇవ్వడంలో నిర్లక్ష్యం, జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, ఓవర్‌లోడ్, కాలిపోవడం, తరలించడం, ఎల్‌టీ కేటగిరి, ఫేజ్ మార్చడం తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.రైతులు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సమాచారం ఇవ్వాలని విద్యుత్ అధికారులు 48 గంటల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చుతారని రెండు రోజుల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు గాని టోల్ ఫ్రీ 1912 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ సభ్యులు కె రమేష్ ఎన్ దేవేందర్ అడిషనల్ డీఈ ఎం రామారావు విద్యుత్ శాఖ ఎస్. ఈ విజయేందర్ రెడ్డి డిఈ విజయ్ ఎఈ మహేందర్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌తో విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
RELATED ARTICLES


