-బావిలో దూకి తల్లికూతురు ఆత్మహత్య
-మహిళ మృతదేహం లభ్యం..
-బాలిక మృతదేహాం కోసం తీవ్రంగా శ్రమించిన గజఈతగాల్లు
బెజ్జంకి, నిఘా న్యూస్ : కుటుంబంలో కలహాలు తలెత్తి మనస్తాపంతో తల్లికూతురు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.జనాగం జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్ స్థానిక పెట్రోల్ బంకులో పని చేస్తూ భార్య శారదా(35),కూతురు స్పందన(14),కుమారుడు రఘువరన్(09)తో కలిసి మండల కేంద్రంలో అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు.గురువారం రాత్రి కుటుంబంలో కలహలు తలెత్తాయి.మనస్తాపానికి గురైన మహిళ తన కూతురు,కుమారుడుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యయత్నాకి పాల్పడడానికి వెళ్లింది. తల్లికూతురు ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.గమనించిన కుమారుడు ఇంటి వద్దకు పరుగెత్తుకు వచ్చి చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు.చుట్టుపక్కల వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మహిళ మృతదేహన్ని వెలికితీశారు.

బాలిక మృతదేహం కోసం తీవ్ర గాలింపు చేపట్టిన లభ్యమవ్వలేదు.ఇతర ప్రాంతం నుండి వచ్చిన గజ ఈతగాల్ల సహయంతో ఎట్టకేలకు బాలిక మృతదేహం వెలికి తీశారు.పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసపత్రికి తరలించారు.మృతురాలి తల్లి వడ్నాల రాజవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.