తీవ్రమైన పని భారం
చాలీచాలని జీతాలు
ఆదివారమూ సెలవు లేదు
విద్యార్థుల ఫీజుల వసూలు తమ బాధ్యత
అడ్మిషన్ల టార్గెట్ తో సతమతం
సెకండరీ స్కూల్ టీచర్లకు 20వేల లోపే వేతనం
పదేళ్లలో ఒక్కసారి డిఎస్సీ నిర్వహించిన గత ప్రభుత్వం
అనారోగ్యానికి గురవుతున్న మహిళా టీచర్లుపట్టించుకోని ప్రైవేట్ యాజమాన్యాలు..
కరీంనగర్ ఫిబ్రవరి 5(నిఘా న్యూస్) కరీంనగర్నగరంలోని ఉన్న అనేక ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది, ఉదయం 8 గంటలకే స్కూల్ సమయం మొదలుకాగా సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది దాదాపు 10 గంటల పని వీరు చేయాల్సి వస్తుంది, తీవ్రమైన పని ఒత్తిడి కి ప్రైవేటు టీచర్లు గురవుతున్నారు చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, వీరికి కొన్ని స్కూళ్లలో ఆదివారం కూడా పనిలో ఉండడం జరుగుతుంది. తద్వారా కుటుంబాన్ని వదిలి వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజులు వసూలు చేయడంలో క్లాస్ టీచర్లదే ప్రధాన బాధ్యత గతంలో స్కూళ్లలో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఫీజుల వసూళ్ల పని చేసేవారు అయితే గత రెండు సంవత్సరాల నుండి ఈ బాధ్యత క్లాస్ టీచర్లపై వేశారు, దీనితో పిల్లలకు పాఠాలు చెబుతూ ఫీజులు వసూలు చేస్తూ అదే విధంగా కొత్త పిల్లల్ని అడ్మిషన్లు చేకూర్చడం కోసం ఇంటింటికి తిరిగి ప్రైవేట్ టీచర్లు చాలా సతమతమవుతున్నారు. కొన్ని స్కూళ్లలో ప్రైమరీ టీచర్లు వేతనం 6 వేల నుండి 12 వేల లోపే ఉంది , అలాగే సెకండరీ స్కూల్ టీచర్లకి 20 వేలకు మించి లేదు వీరిలో చాలామంది టెట్ క్వాలిఫై అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే చాలా ఎక్కువ గత పది ఏళ్లలో ఒక్కసారి మాత్రమే డీఎస్సీ నిర్వహించిన గత ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ రాలేదు, చాలామంది ప్రైవేటు ఉద్యోగంలోనే స్థిరపడి పని భారం కి గురవుతూ మానసికంగా మరియు శారీరకంగా గంటల తరబడి నిలబడి అనారోగ్యానికి ప్రధానంగా మహిళా టీచర్లు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రైవేట్ యాజమాన్యాలు పట్టించుకోని టీచర్ల వేతనాలని పెంచి మరియు వాళ్ళ పని గంటలని తగ్గించాలని వారు కోరుతున్నారు.