మందుల నుంచి మొదలు ఆపరేషన్ల వరకు అంతా మాయాజాలం
ఈ మందుల మాఫియాను అరికట్టే నాధుడే లేడా
కరీంనగర్, నిఘా న్యూస్:వైద్యులను వైద్య నారాయణ హరి అంటారు అంటే వైద్యులు దేవునితో సమానమని ప్రతి ఒక రోగి వైద్యుని దేవునితో సమానంగా చూస్తుంటారు అలాంటి వైద్యుల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవా లో వైద్యుల మాయాజాలం ఇంత అంతా కాదు దావఖానలో అడుగుపెట్టిన మంటే కలిసి ఉంటే ఫీజు ఒకటే మన చేతిలో ఉంటుంది పొరపాటున ఫీజు కట్టి హాస్పిటల్స్ లోకి ఎంట్రీ ఇచ్చామంటే అంతే సంగతులు మొదట రక్త పరీక్షలు మూత్ర పరీక్షల నుండి దోపిడి తతంగం ప్రారంభమవుతుంది ప్రతి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ వాళ్లదే మెడికల్ వాళ్ళదే చుట్టుపక్కల స్కానింగ్ సెంటర్లు కూడా వాళ్లే ఏ పరీక్ష చేయించుకున్న ఏ స్కానింగ్ చేయించుకున్న సదరు సిఫారసు చేసిన హాస్పిటల్స్ కి కమిషన్లు ముట్టాల్సిందే పొరపాటున వాళ్లు సిపరసు చేసిన స్కానింగ్ సెంటర్లు గానీ ల్యాబ్ సెంటర్లు గాక వేరే సెంటర్లోకి వెళితే అవి బాగా రాలేదు వాళ్లకి తీయడం రాదు అని చెప్పేసి కమిషన్ల కోసం వాళ్లు సిఫారసు చేసిన సెంటర్లకు మాత్రమే రోగులను పంపుతూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు అంతేకాకుండా మెడికల్ విషయానికొస్తే మనం ఏ హాస్పిటల్ అయితే వెళ్తామో వాళ్లు రాసే మందులు ఆ హాస్పిటల్ మెడికల్ లోనే దొరుకుతాయి మిగతా మందు పట్టణ మొత్తం ఎక్కడ కూడా దొరకవు ఎందుకంటే వాళ్లు రాసే మందులు వాళ్ల మెడికల్ షాపులోనే తీసుకుంటే హాస్పిటల్ వరకు కమిషన్ పుడుతుంది ఇందులో సగం మందులు జనరిక్ మందులే ఉంటాయి దాదాపుగా మందులు 20 రూపాయలకు సీటు వస్తే ఎమ్మార్పీ వచ్చేసి 150 నుండి 200 వరకు ఉంటుంది ఇంత దారుణంగా ప్రజలను దోసుకుంటా ఉంటే పట్టించుకోవాల్సిన వైద్యాధికారులు మాత్రం గాఢ నిద్రలోనే ఉంటారు ఎందుకంటే ఎవరు ఎక్కడ పోతే మాకేంటి మాకు నెల నెల మామూలు వస్తే చాలని అనుకుంటున్నారని రోగులు వాపోతున్నారు ఇదిలా ఉంటే కొందరు అర్హత లేని డాక్టర్లు కూడా వైద్యం చేస్తున్నట్టు కొన్ని పత్రికలలో వార్తా కథనాలు వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏమిటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు అంతేకాకుండా కొందరు గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ దావకానలు డ్యూటీలు చేస్తూ సొంతంగా హాస్పిటల్ ఏర్పరచుకొని గవర్నమెంట్ దోగర్లకు వచ్చిన రోగులను తమ అనుచరులుచే పలాని హాస్పిటల్ కొమ్మని చెప్పిస్తూ రోగులను ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిస్తున్న అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి డాక్టర్లు ఇలాంటి ప్రైవేటు హాస్పిటల్స్ చేయబట్టి జ్వరం వచ్చిందంటే చాలు రక్త కణాలు తగ్గినై ఆర్టీసీ చేయాలి ఈ టెస్ట్ చేయాలి ఆ పరీక్షలు అంటూ ప్రజల సొమ్మును యదేచ్చగా దోచుకుంటున్నారు ప్రతి ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ లలో ప్రతి ఒక్క జబ్బుకు ఇంత అని ఈ ఆపరేషన్కు ఇంత అని ధరల పట్టిక పెట్టవలసిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఏ ఒక్క హాస్పిటల్లో కూడా పెట్టడం లేదు ఇదంతా అధికారులకు తెలిసిన చూసి చూడనట్టు వివరించడం ఏంటని ప్రజలు కాబోతున్నారు కొన్ని హాస్పిటల్లో మాత్రం సరైన సౌకర్యాలు కూడా ఉండడం లేదు ఇదంతా చూసి సరియైన వసతులు ఉన్నాయా లేవా అనే తెలుసుకునే అధికారులు మాత్రం ఎప్పుడు మేలుకుంటారో ఏమో సగటు మనిషి ఆవేదన ఇకనైనా అధికారులు కన్ను తెరిచి ప్రతి ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ జబ్బును బట్టి ధరల పట్టిక మీద రేట్లు వేయాలని సరియైన వసతులు లేని హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కోరుతున్నారు