రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 23 (నిఘా న్యూస్)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడ్డు అదుపు లేకుండా ప్రైవేటు దావకాన నిర్వాహకులు మరియు ల్యాబ్ సెంటర్లు స్కానింగ్ సెంటర్లు రక్తం తాగుతున్న ల్యాబ్ సెంటర్లు..కమిషన్ దారులుగా ఆర్ఎంపి పీఎంపీలు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ దావఖానాలు వైద్యం కోసం ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఏదైనా జబ్బు పడి దావకానకు వచ్చినం అంటే కొంపకోల్లేరు చేసేస్తున్నారు. చిన్నచిన్న జబ్బులకు కూడా కమిషన్లకు కక్కుర్తి పడి ఆర్ఎంపీలు పీఎంపీలు పెద్ద దావనలకు సిపరసు చేసి తీసుకువస్తున్నారు. వచ్చిన నుండి మొదలు ఆటెస్టు ఈ టెస్ట్ అంటూ రకరకాల టెస్టులు చేసి రక్త పరీక్ష సెంటర్లకు పంపుతూ రక్త పరీక్ష మరియు స్కానింగ్ ఏదైనా సదరు దావకాన రిఫర్ చేసిన సెంటర్లకు పంపుతూ అందులో కూడా కమిషన్లు దండుకుంటూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రక్త పరీక్ష స్కానింగ్ పరీక్షలకు అధిక ధరలు వసూలు చేస్తున్న ల్యాబ్ మరియు స్కానింగ్ సెంటర్లను గుర్తించేందుకు నియమించిన సంబంధిత అధికారులు ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లాలో విచ్చలవిడిగా దోపిడి జరుగుతున్న మౌనం వహించడం వెనక మతలబేమిటో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని దావకానాలలో బిహెచ్ఎంఎస్ చేసిన డాక్టర్లు కూడా ఎంబిబిఎస్ గా చలమణి అవుతూ వైద్యం చేస్తు ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు.అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వీడి దావాఖానాలను స్కానింగ్ సెంటర్ లను ల్యాబ్ సెంటర్లను తనిఖీ చేసి ధ్రువ పత్రాలు లేని నకిలీ స్కానింగ్ సెంటర్లపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే ఎలాంటి కమిషన్లకు తావు లేకుండా సదరు టెస్టులకు సంబంధించిన రేట్లను సూచిక బోర్డుపై పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కోరుతున్నారు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ దవాఖానాలు..
RELATED ARTICLES


