జమ్మికుంట( నిఘా న్యూస్): అత్యవసర పరిస్థితిలో వినియోగించే అంబులెన్స్ యజమానులు నిర్లక్ష్య వైఖరులతో ప్రాణాలకే చేటు చేకూరుతుంది కొంతమంది నిరుపేదలు వీళ్ళ నిర్వాహకం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం మౌలిక వసతులు లేకుండా, కనీసం డీజిల్ పెట్రోల్ కూడా చూసుకున్న పాపాన పోవడం లేదు. టెక్నీషియన్ లేకుండా డబ్బు సంపాదనమే ధ్యేయంగా ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. వేలాది రూపాయలు డిమాండ్ చేసి దండుకుంటున్నప్పటికీ ప్రాణాలకు మాత్రం భద్రత లేదు. వీరి నిర్వహణ వల్ల ఎంతో మంది పేద ప్రజలు తమ కుటుంబ సభ్యులను, కుటుంబ పెద్దలను కోల్పోతున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకున్నారు. వీటిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు చర్య తీసుకుని మరికొంతమంది నిరుపేదల ప్రాణాలు గాల్లో కలవకుండా చూడాలని స్థానిక పేద ప్రజలు కోరుతున్నారు.
ప్రాణాలతో చెలగామాడుతున్న ప్రైవేటు అంబులెన్స్ లు
RELATED ARTICLES