న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీ క్షించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించడం, బాధిత ప్రజలను కలవ డంతోపాటు ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రులు, బాధి తుల కుటుంబాలను కూడా ఆయన కలుసుకుంటారు.
ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకుని, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు, కొండచ రియలు విరిగిపడిన ప్రాంతా న్ని సందర్శిస్తారు.అక్కడ సహాయక బృందా లు నిర్వహిస్తున్న ఆపరేషన్ గురించి ఆయనకు తెలియ జేస్తారు. కొండచరియలు విరిగిపడిన బాధితులను పరామర్శించే సహాయ శిబిరాలు, ఆసుపత్రులను కూడా ప్రధాని సందర్శించ నున్నారు.
ఆ తర్వాత మోడీ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అందులో సంఘటన, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి వివరంగా తెలియజేస్తారు.కాగా వాయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు, కేరళ ప్రభుత్వ క్యాబినెట్ సబ్‌కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర బృందంతో సమావేశమైంది.విపత్తు దెబ్బతిన్న ప్రాంతం లో పునరావాసం, సహా యక చర్యల కోసం రూ. 2,000 కోట్ల సహాయం కోరింది. హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృ త్వంలోని కేంద్ర బృందం విపత్తు ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి, బాధిత ప్రజల తో మాట్లాడారు..
వాయనాడ్ కొండచరియల ప్రభావం భారీగా ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం అవసరమని అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం తెలిపింది.