Saturday, March 7, 2026

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక

హైద‌రాబాద్‌, నిఘా న్యూస్:భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ‌నివారం హైద‌రా బాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి శుక్ర‌వారమే సమీక్ష నిర్వహించారు.రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ట్రాల‌కు సంబంధించిన స్టాళ్లను, నాలుగు ఫుడ్‌ కోర్టులు, మీడియా సెంటర్‌, ఇతర స్టాళ్లను పరిశీలించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఈరోజు హైద‌రాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ విశ్వప్రసాద్‌ తెలిపారు.శ‌నివారం ఉదయం 9 గంటల నుంచి బేగంపేట , హెచ్‌పీఎస్‌, పీఎన్‌టీ జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని స్ప‌ష్టం చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular