మంథని , నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని వయో వృద్ధుల డే కేర్ కేంద్రంలో బుధవారం ముందస్తు ఉగాది ఉత్సవాలతో పాటు..ఉగాది సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల సహేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారి కోసం ఈ డే కేర్ సెంటర్ ను మంథనిలో ప్రారంభించి వృద్ధులకు అన్ని వసతులు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉగాది వేళ మంత్రపురి కవులైన నరసింహచారి, వసుధ రాణి, అరుణ, గీత, రావికంటి మనోహర్, పెద్దపెల్లి జిల్లా పెన్షనర్స్ సహా అధ్యక్షులు రామ డుగు మారుతి, నిర్వాహ కులు సత్యనారాయణ,కు స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ మేడగోని రాజమౌళి గౌడ్, తదితరు లను ఈ సందర్భంగా వారు ఘనంగా సన్మానించారు.


