వేములవాడ, నిఘా న్యూస్:బోయినపల్లి హైదరాబాద్లో తల పెట్టిన ఆశ వర్కర్ల ధర్నా పిలుపులో భాగంగాసీఐటీయూ జిల్లా నాయకుడిని గురిజలా శ్రీధర్ ను ,మరియు బోయిన్పల్లి మండల ఆశా వర్కర్లనుఎమర్జెన్సీ తలపించేలా ఉదయం 4,గంటల ప్రాంతంలో నిర్బంధాన్ని తలపించే విధంగా ఇంటికి వచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని.ప్రజా స్వామ్యబద్దంగా ఆశ వర్కర్ల హక్కులసాధనకై ,వారి సమస్యలు నెరవేర్చాలని,సిఐటియుగానిలబడ్డా నాయకులకు నిరసన తెలియ జేసే హక్కును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తూ మాది ప్రజా పాలన చెప్పుకొని అధికారంలోకివచ్చి ఇప్పుడుముందస్తు అరెస్టులతో నిర్బందని తలపించేలా వ్యవహరిస్తుందని. ఆశావర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లను పరిష్కరించాల్సిందిపోయి గత ప్రభుత్వ మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టినగతే పడుతుందని ఈ సందర్భంగా కార్మిక వర్గాల తరఫున,సీఐటీయూ జిల్లా నాయకుడు గురిజలశ్రీధర్ ఆశ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా నాయకులు , ఆశ వర్కర్ల ముందస్తు అరెస్ట్
RELATED ARTICLES


