భారీగా తరలి వచ్చిన పట్టభద్రులు
ఓగ్గు డోలు నృత్యాలు, డప్పు చప్పులతో ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చిన ప్రసన్న హరికృష్ణ
ర్యాలీ పొడవున నీరాజనం పలికిన గ్రాడ్యుయేట్స్,
నిరుద్యోగులుహరికృష్ణకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్
కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ శుక్రవారం అనుచరగణం, మద్దతుదారులు, అభిమానులు, పట్టభద్రులు భారీగా వెంట తరలి రాగా నామినేషన్ ధాఖాలు చేసారు. కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ నుండి ఓగ్గుడోలు నృత్యాలు, అభిమానుల నృత్యాలుతో ఓపెన్‌టాప్ జీపులో కోర్టు చౌరస్తా, ఆర్ అండ్ బి గెస్ట్ హుజ్ , తెలంగాణ చౌక్ ,ప్రతిమ మల్టీప్లెక్స్ మీరుగా కలెక్టరేట్ చేరుకుని తన నామినేషన్‌ను ధాఖాలు చేసారు. ర్యాలీకి ముందు ఎస్సారార్ కాలేజీ వద్ద భారీగాతరలి వచ్చిన పట్టభద్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీరు ఉన్నరనే భరోసాతో ఎమ్మేల్సీ ఎన్నికల బరిలో నిలిచానని, యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటిచ్చారు.నామినేషన్ వేసిన అనంతరం కలేక్టరేట్ వద్ద మీడియా పాయింట్ వద్ద విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తన 19 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత పక్షాణ ప్రశ్నించే గొంతుకనై వారి సమస్యలను పరిష్కరింప చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పట్టభద్రులు,
మేధావులు మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైనదని, ఇప్పుడు మౌనం వీడకుంటే ఎప్పటికి మౌనంగా ఉండాల్సి వస్తుందన్నారు.విద్యావ్యాపారం చేసే వ్యక్తులు, ఊసరవెల్లి రంగులు మార్చినట్టు,తోడేలు జింక చర్మం కప్పుకున్నట్లుగా రాజకీయాల్లోకి వస్తున్నారని వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్ధులకు ఫీజుల్లో నయా పైసాకూడా తగ్గించలేని వారు ఇప్పుడు విద్యార్ధులకు న్యాయం చేస్తామని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగాల్భలు పలుకుతున్నారని ఆయన ఏద్దేవా చేసారు. ఐఐటి, నీట్, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో విద్య అందిస్తున్నమని విద్యార్ధుల, వారి తల్లిదండ్రులను పీడించి వేలాధి కోట్ల రూపాయలు ఆస్తులు, బిల్డింగ్‌ల మీద బిల్డింగ్లు కట్టిన వ్యక్తులు ఇప్పడు వాటిని కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పట్టభద్రులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు వాస్తవాలు గమనించాలన్నారు. మీ వాడిగా, మీ గొంతుకగా, మీ సమస్యల పరిష్కరానికి నిత్యం పోరాటం చేయడానికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.మీరు ఇస్తున్న ప్రోత్సాహం నేను ఎన్నటికి మరిచి పోను, మీలో ఒక్కడిగా మీ సమస్యల పరిష్కరానికి శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానని, మీ సమస్యలను పరిష్కరింపచేస్తు పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిత్యపోరాటం చేస్తానని ఆయన ఈ సందర్భంగా పట్టభద్రులకు, నిరుద్యోగులకు మాటిచ్చారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, నిరుద్యోగులు, పట్టభద్రులు మరియు ప్రసన్న హరిక్రిష్ణ టీం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.దయచేసి తమ తమ పత్రికలలో ప్రచురించగలరని మనవి.


