మంచిర్యాల జిల్లా, నిఘా న్యూస్ :అక్టోబర్ 26తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ లకు 24 గంటలపాటు ఉద్యోగాలం టూ ఇండ్లకు రావడంలేదని, కనీసం మంచి చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని పోలీసు భార్యలు కన్నీరు పెట్టుకున్నారు.
ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ 13వ బెటాలియన్ లో విధులు నిర్వహించే పోలీసుల భార్యలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… ఓకే చోట ఉద్యోగం చేయకుండా రాష్ట్రమంతటా తిప్పుతున్నారని వారు వాపోయారు. రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల నిరసన తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకో వడంలేదని పోలీస్ భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు..


