Thursday, February 26, 2026

రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసుల అవగాహన!

పెద్దపల్లి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా.. మంథని పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై సోమవారం గంగపురి ప్రధాన రహదారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకు ముందు ప్రమాద స్పాట్ లైనా గాడిదల గండి, ఆరెంద ఎక్స్ రోడ్ , ఎక్లాస్పూర్ ఎక్స్ రోడ్, గంగపురి ఎక్స్ రోడ్, లు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా డిసీపి రాంరెడ్డి, రామగుండం ఏసిపి మడత రమేష్, మంథని సీఐ రాజు గౌడ్, ఎస్సై డేగ రమేష్,ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు… ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను ఎలా నివారించాలి, హెల్మెట్ సీట్ బెల్ట్ ప్రాధాన్యత, డ్రంక్ అండ్ డ్రైవ్, వల్ల జరిగే అనర్ధాలు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.

మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడద న్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాల న్నారు. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే తమ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతారని వారు గుర్తు చేశారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడు దీని సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమ వుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular