Friday, February 27, 2026

మేడారం ఒడిలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు!

ములుగు జిల్లా నిఘా న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు మేడారం ముస్తాబయింది, కోట్లాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించు కునేందుకు తరలివస్తున్నా రు.ఈ జాతరలో పారిశు ద్ధ్య, ప్లాస్టిక్, కవర్ల ముప్పు పొంచి ఉంది, జాతర ముగిశాక మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది,ఇది అధికా రులకు పెద్ద సవాలుగా మారనున్నది.

ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు అడవుల్లో పేరుకు పోవడంతో భూగర్భజలా లకే కాదు, అటవీ జీవజా లానికి కూడా తీవ్ర ముప్పు ఏర్పడింది. ప్లాస్టిక్ నివారిం చాడనికి తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియో గాన్ని పూర్తిగా నిషేధించా లని నిర్ణయించింది.

జాతర ప్రాంతంలో వ్యా పారులు తప్పనిసరిగా పర్యావరణ అనుకూల పదార్థాలనే వినియోగిం చాలని ఆదేశాలు జారీ చేసింది. క్లాత్ బ్యాగులు, స్టీల్ గ్లాసులు, ఆకులతో చేసిన ప్లేట్లు వాడాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.అదేవిధంగా జాతర ప్రాంగణం అంతటా ప్రత్యేక చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా వర్గీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లతో కలిసి రోజు వారీగా చెత్త తొలగింపు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్లాస్టిక్ నివారించడాకి భక్తులు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో భారీ ఏర్పాట్లు చేసింది. 5,500 తాత్కాలిక నీటి కుళాయిలు, 517 బ్యాటరీ కుళాయిలు, 47 సిస్టర్న్లు, 312 సిస్టర్న్ కుళాయిలు, 10 చలి వేంద్రాలు ఉన్నా యి. 285 టాయిలెట్ బ్లాక్‌ లలో 5,700 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

మరుగుదొడ్ల శుభ్రంగా ఉండేందుకు 3 షిఫ్టులలో 5,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించా రు. మేడారం ప్రాంతాన్ని 25 పారిశుధ్య విభాగా లుగా విభజించారు. రంగాల వారీగా 526 మంది పర్యవేక్షకులను నియమించారు. వ్యర్థాల తొలగింపు కోసం 100 ట్రాక్టర్లు, దుమ్ము అణచివేతకు 150 నీటి ట్యాంకర్‌లు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా .. పర్యవరణాని కాపాడేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular