వరంగల్, నిఘా న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బంగారు తెలంగాణ పేరుతో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినందుకుగాను తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం జరిగిందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు ఉండడం జరిగిందని,ఈ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు,లేకపోతే బడుగు బలహీన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు.కళాశాలలో ఉన్న అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో TNSF వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి ఇరుగు రవీందర్ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరపాక ప్రభాకర్ భూపాల్ పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ ముక్కిరాల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ పరకాల నియోజకవర్గం బాధ్యులు నరేష్ ఉమ్మడి వాణిజ సెల్ మాజీ అధ్యక్షులు వెలగందల రవీందర్ గుప్తా కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, TNSF వరంగల్ ఇంచార్జీ ఇరుగు రవీందర్ పాల్గొన్నారు.