Friday, February 27, 2026

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మా ప్యానలే గెలుస్తుంది..

మా అభ్యర్థులంతా మంచి అనుభవం..ఆలోచన.. ఆశయం కలవారు..

మా ప్యానల్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విప్ ఆది శ్రీనివాస్ ఆశీర్వదించారు..

అర్బన్ బ్యాంకులో వినూత్నమైన సంస్కరణలు తీసుకొస్తాం..

బ్యాంకు డిపాజిట్లను మూడింతలు పెంచుతాం..

అర్బన్ బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులతో కలిసి వెలిచాల ప్రెస్ మీట్..

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు సభ్యుల సహకారంతో 100% తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ అభ్యర్థులు మంచి అనుభవం మంచి ఆశయం ఆలోచన కలిగిన వారు అని పేర్కొన్నారు. విజయం సాధించిన తర్వాత అర్బన్ బ్యాంకును అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన నీతిమంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం వెలిచాల ప్రజా కార్యాలయంలో అర్బన్ బ్యాంకు ప్యానెల్ అభ్యర్థులతో కలిసి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజేందర్ రావు తమ ప్యానల్ అభ్యర్థులను ప్రకటించారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక.. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారే మళ్లీ వారే అధికారం కోసం తాపత్రయపడుతున్న అంశంతో పాటు పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వెల్చాల రాజేందర్రావు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కరీంనగర్ అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగలేదన్నారు. బ్యాంకుకు సంబంధించిన వివిధ అలిగేషన్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఒకరిపై ఒకరు ఈ విషయంలో దుమ్మెత్తి పోసుకున్నారని చెప్పారు. కోర్టులో కేసులు నడవడం వల్ల ఎన్నికలకు జాప్యం జరిగిందన్నారు. తిరిగి మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. తమ ప్యానల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత అర్బన్ బ్యాంకు ను పూర్తిస్థాయిలో సంస్కరిస్తామని స్పష్టం చేశారు. ఖాతాదారులు సభ్యులకూ భద్రత కల్పిస్తామని వారి సొమ్ముకు ఎలాంటి డోకా లేకుండా సేవలందిస్తామని తెలిపారు. ప్రస్తుతం అర్బన్ బ్యాంకులో 92 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తమ ప్యానల్ గెలిస్తే ఈ డిపాజిట్లను మూడింతలుగా అయ్యేలా చేస్తామన్నారు. అదేవిధంగా నాలుగు కొత్త బ్రాంచ్ ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. హుస్నాబాద్ చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంటలో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖాతాదారులకు నిజాయితీగా సేవలందించేందుకు తమ ప్యానల్ అభ్యర్థులు కృషి చేస్తారని రాజేందర్రావు పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల కంటే అర్బన్ బ్యాంకుకు మంచి పేరు తీసుకొస్తామని ఖాతాదారులకు త్వర త్వరగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా రుణాలు ఇవ్వడం డిపాజిట్లు సేకరించడం.. బ్యాంకు ను డిజిటలైజ్డ్ చేయడంతో పాటు ఖాతాదారులను చేర్పించడంతో పాటు మొత్తానికి అర్బన్ బ్యాంకును పూర్తిస్థాయిలో సంస్కరిస్తామని తెలిపారు.. కాంగ్రెస్ వ్యక్తిత్వము భావజాలం కలిగిన వారు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవాళ్లందరూ ముందుకొచ్చారనీ, వారందరిని కలిపి ఒక ప్యానెల్ గా ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ముడిపడి ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి వెంట ఉండి గెలిపించే బాధ్యత తాను తీసుకున్నానని రాజేందర్ రావు స్పష్టం చేశారు. మా ప్యానల్ గెలిస్తే అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో ఖాతాదారులకు సభ్యులకు భరోసా కల్పించేందుకు అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్యానల్ ఎంపికలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఉండే విధంగా చూశామని మహిళలు, ఎస్సీలు బీసీలు ఇతర వర్గాలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు అర్బన్ బ్యాంకు ఓటర్లు తమ తమ ప్యానెల్ ను కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. ఖాతాదారులను ఓటర్లను స్వయంగా కలిసి ఓటును అభ్యర్థించి మంచి మెజార్టీతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు బిజెపి బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి ఒక ప్యానెల్గా ఏర్పాటు చేసుకొని ఓటర్ల ముందుకు వస్తున్నారని తెలిపారు. తమ ప్యానల్ లో ఉన్న వారి వ్యక్తిత్వము అనుభవము ఆలోచన తీరు అన్ని ఆలోచించి ఓటర్లు తమకు పట్టం కడతారని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన వారి తీరు బెరీజు వేసుకొని ఓటర్లు ఆలోచన చేయాలని సూచించారు. తమ ప్యానెల్ కు అవకాశం ఇస్తే బ్యాంకును తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దుతామని రాజేందర్రావు స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ నియోజకవర్గ నుంచి మంచి ఆశయం పట్టుదల ఉన్న ఇద్దరిని తమ ప్యానెల్ కు ప్రతిపాదించారని ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తమ ప్యానెల్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతుందని ఓటర్లు తమకు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని రాజేందర్ రావు తెలిపారు.

ప్యానెల్ కు మంత్రుల ఆశీర్వాదం..

శనివారం ఉదయం తన ఆధ్వర్యంలో హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కరీంనగర్ అర్బన్ బ్యాంకు ప్యానల్ డైరెక్టర్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశామని వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్యానెల్ డైరెక్టర్లను మంత్రులు, విప్ కు రాజేందర్ రావు పరిచయం చేశానని చెప్పారు. పానల్ డైరెక్టర్లకు మంత్రులు విప్ ప్రత్యేక ఆశీర్వాదం.. ఆశీస్సులు అందజేశారని తెలిపారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో అభ్యర్థులంతా గెలిచి రావాలని సూచించారని చెప్పారు. గెలిచి వచ్చి అర్బన్ బ్యాంకు ను మరింత అభివృద్ధి చేసుకోవాలని తమకు సూచించారని రాజేందర్ రావు పేర్కొన్నారు. మీ అందరికీ అండగా మేముంటామని మంత్రులు భరోసా కల్పించారని తెలిపారు. తమ ప్యానెల్ కు మంత్రులు విప్ అండగా ఉంటామని ఆశీర్వదించడం ఎంతో బలాన్ని ఇచ్చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. కచ్చితంగా గెలిచి వస్తామని వారికి గంట పదంగా చెప్పామని ఆయన తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో రాజేందర్ రావ్ మద్దతిస్తున్న అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్ కుమార్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular