Wednesday, August 6, 2025

మామూళ్ల మత్తులో విద్యుత్ శాఖ అధికారులు…

పాత విద్యుత్ మీటర్లతోనే ఐదంతస్తుల భవన నిర్మాణం

చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు…….

కరీంనగర్ (నిఘాన్యూస్):వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది.ఈ విద్యుత్ శాఖ అధికారుల పనితీరు సామాన్యుడు గృహ నిర్మాణం చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టే విద్యుత్ శాఖ అధికారులు కళ్ళ ముందే ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతూ అందుకు పాత ఇంటి మీటర్లను ఉపయోగిస్తున్న చూచి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి సబ్ స్టేషన్ పరిధిలోని శుభం గార్డెన్ ముందు గత సంవత్సర కాలం నుండి ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. పాత ఇంటికి సంబంధించిన మీటర్ నెంబర్ లు ఆర్ కే టి- 6039, ఆర్ కె టి-4304, ఆర్ కే టి-6322, ఆర్ కె టి -6040 గల
క్యాటగిరి వన్ మీటర్ ఉపయోగిస్తూ ఐదంతస్తుల నూతన గృహ నిర్మాణం చేపడుతున్నప్పటికీ ఏరియా లైన్మెన్ శామయ్య గృహ నిర్మాణ యజమానితో కుమ్మక్కై అక్రమ లావాదేవీలకు పాల్పడుతూ సంస్థకు నష్టం చేస్తున్నారు. అక్రమ విద్యుత్ వినియోగంపై గత కొంతకాలంగా రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ పలుమార్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఏ స్థాయిలో అధికారులకు ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు. ఐదంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలంటే ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఉల్లంఘించి పాత మీటర్ల ను ఉపయోగించి ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని చేపడుతున్నారంటే ఆ ఇంటి యజమానికి ఏ స్థాయిలో విద్యుత్ శాఖ అధికారులతో సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఐదంతస్తుల భవన నిర్మాణానికి అక్రమంగా వినియోగిస్తున్న విద్యుత్ తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతారా ఇంకా ఇలాంటి భవనాలు ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా దృష్టి పెడతారా లేదా అనేది వేచి చూడాలి మరి.. ఈ విషయంపై కరీంనగర్ విద్యుత్ ఎస్సీ ని వివరణ కోరుదామని ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular