Sunday, August 3, 2025

వైద్య ఆరోగ్య శాఖలో 6,640 పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉద్యో గాల జాతర మొదలైంది, దీనికోసం వైద్య, ఆరోగ్యశాఖలో 6,640 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేయాలని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది.

ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రిక్రూ ట్మెంట్ బోర్డు వర్గాలు తెలిపాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్టు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మాసిస్టులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్లు, 1950 మల్టీపర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలి తాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయగా మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి.

నీట్ పరీక్షా ఫలితాలు విడుదలై ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, డెంటల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. శుక్రవారం లేదా శనివారం ఈ మూడు నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular