తెలంగాణ నూతన గవర్నర్ గా రేపు ప్రమాణ స్వీకారం?
హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబా ద్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయా నికి చేరుకున్న గవర్నర్ దంపతులకుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు మరియు ఉన్నతాధికారు లు ఘనస్వాగతం పలికారు.
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేపట్టిన గవర్నర్ల బదిలీల్లో భాగంగా హిమా చల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తు తం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.
ఈ నెల 16న అసెంబ్లీలో నూతన గవర్నర్ తొలి ప్రసంగం:
రేపు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లోక్ భవన్‌లో జరుగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన తొలి ప్రసంగం చేయనున్నారు.
ఆరోజు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివప్రతాప్ శుక్లా బీజేపీలో సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పనిచేశారు. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2017 నుంచి 2019 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఫిబ్రవరి 2023 నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


