కరీంనగర్, నిఘా న్యూస్: దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు భవానీ దీక్షలు తీసుకున్నారు. జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో భవాని దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.



