కరీంనగర్ మార్చి 8(నిఘా న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కళాశాల విద్యార్థినిలకు నారీ శక్తి ఫిట్నెస్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న యువజన సంఘాల ప్రతినిది తొర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళ శక్తివంతురాలు అయినప్పుడే,దేశం శక్తివంతమవుతుందనే నినాదం తో నెహ్రూయువకేంద్రము ఈ ప్రోగ్రాంను చేపట్టిందన్నారు . విభిన్న రంగాల్లో మహిళలు సాదిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తి ని చాటుతున్నాయని తెలిపారు.పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు కళాశాల చెర్మెన్ గోవిందారం కృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శేఖర్,యువజన సంఘాల నాయకులు తొర్తి శ్రీనివాస్,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.