సంగారెడ్డి , నిఘా న్యూస్:సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గఆధ్వర్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘనంగా పాలాభిషేకంచేశారు. శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ వినియోగదారులందరికీ శుభవార్త తెలిపిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్క గ్యాస్ సిలిండర్ వెనుక 100 రూపాయల తగ్గించి మహిళా మణులందరికీ కుటుంబ భారంలో పెద్దన్నగా నిలిచిన మా అన్న నరేంద్ర మోడీ నిలిచారని అన్నారు. దేశశంలో ప్రతి పేదవారికి ఆశాజ్యోతి నరేంద్ర మోది పేర్కొన్నారు.వచ్చే పార్ల మెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి మోదీకి బహుమానంగా ఇస్తానని పేర్కొన్నారు.పేదల అండగా నిలిచి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు . బిజెపి తరపున ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లాపార్టీ ఇంఛార్జి పులిమామిడి రాజు కమిటీ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండలాధ్యక్షులు మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రగతి సాధకుడు నరేంద్ర మోదీ
RELATED ARTICLES