Sunday, August 3, 2025

నయీమ్ కేసు రీ ఓపెన్?

… ఆస్తుల లెక్క తేల్చేందుకు స్పెషల్ టీమ్

… ఇద్దరు సీనియర్ ఐపీఎస్లతో బృందం

… ఇప్పటికే ఓ సీనియర్ అధికారితో చర్చించిన సీఎం!

… కేసు మళ్లీ ఓపెన్ చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతల పట్టు

… నయీమ్ ఆస్తులన్నీ ఇద్దరు మాజీ మంత్రుల దగ్గర ఉన్నట్లు ఆరోపణలు

హైదరాబాద్, (నిఘ న్యూస్):తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మళ్లీ తెరపై కొచ్చింది. 40కి పైగా హత్యలు, బెదిరింపు కేసులతోపాటు లెక్కలేనన్ని సెటిల్ మెంట్లు, రూ.వందల కోట్ల అక్రమ ఆస్తులతో మోస్ట్ వాటెండ్ క్రిమినల్ మారి, ఆగస్టు 2016లో ఎన్ కౌంటర్ అయిన నయీమ్కు సంబంధించిన కేసు ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.

ఫోన్లలో డాటా, డైరీలు, రూ. వేల కోట్ల ఆస్తులు ఎటెళ్లాయి..? నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఎన్ కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న 602 సెల్ ఫోన్లలో డాటా, 130 డైరీలు, రూ.వేల కోట్ల ఆస్తులు. భూములను గత ప్రభుత్వం ఏం చేసింది..? ఆ ఆస్తులు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకువెళ్తంది. దీనికి తోడు.. ఇటీవల కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ నయీమ్ ఆస్తులు బీఆర్ఎస్ ముఖ్య నేతల చేతుల్లోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నయీమ్ ఆస్తులను కొందరు నేతలు నొక్కేశా రని గతంలో ఆరోపించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేసును ఎందుకు రీ ఓపెన్ చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నయీమ్ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఇప్పుడు కేసును మళ్లీ రీఓపెన్ చేసి ఎవరి పాత్ర ఏంటనేది తేల్చాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కటిగా వెలుగులోకి..! ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ అక్రమాల అంశాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని పని మనిషి పేరిట 40 ఇళ్లు.. నయీమ్ ఇంట్లో పట్టుబడ్డవంటమనిషి ఫర్హానా పేరిట హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని సమాచారం. అయితే నయీమ్ రెండు రకాలుగా ఆస్తులను సంపాదించేవాడని సిట్ విచారణలో తేలింది. తన అనుచరుల ద్వారా ఆస్తుల సమాచారం సేకరించి, వాటి యజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆక్రమించుకునే వాడు. ఎవరైనా భాగస్వామ్య వివాదాలతో తన వద్దకు వస్తే ఇద్దర్నీ కాదని ఆ ఆస్తిని తనపరం చేసుకునేవాడు.

ఆస్తుల విలువ రూ.1200 కోట్లపైమాటే!

నయీమ్, అతడి బినామీల పేరుపై ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ కూడా అప్పట్లో అంచనా వేసింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 1,015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్ గుర్తించింది. హైదరాబాద్లోని నయీమ్ డెన్లో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 8 లక్షల 52 వేల 400 రూపాయల నగదుతోపాటు 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అప్పట్లో పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular