Wednesday, August 6, 2025

తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి : పరీక్షకు హాజరైన విద్యార్థిని

భూపాలపల్లి జిల్లా: మార్చి 14(నిఘా న్యూస్):ఇంటర్మీడియట్ పరీక్షలు. విద్యార్థులకు తొలి మెట్టే ఈ పరీక్షలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్షల్లో పాస య్యే అవకాశం ఉండదు. ఎంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలు బాగా రాయండి అంటూ పిల్లలకు తల్లిదం డ్రుల ఆశీర్వాదం. ఇది ఎప్పుడు జరిగే తంతే. అయితే తాజాగా..ఈరోజు ఇంటర్ పరీక్షలు ముగియనుండగా కూతుర్ని తీసుకురావడానికి ములుగు జిల్లా నుండి భూపాలపల్లి జిల్లాకు బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన రెంటాల సౌమ్య భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ కాలేజీలో Bipc సెకండ్ ఇయర్ చదువుతుంది .ఈరోజు అమ్మ వస్తుందన్నా సంతోషంలో కూతురు రొంటాల సౌమ్య కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఈరోజు పరీక్ష రాయడానికి వచ్చింది. అమ్మ ఇక లేదు రాదు అన్న విషయం తెలియక అమ్మ నా కోసం వస్తుంది అనే సంతోషంలో పరీక్ష పూర్తి చేసింది.

పరీక్ష ముగియగానే పరీక్ష హాల్లో నుండి సంతో షంలో బయటకు వచ్చిన తర్వాత ఆమె కాస్ టీచర్ తో ఈరోజు పరీక్ష బాగా రాశాను మేడం అంటూ నవ్వుతూ చెప్పింది. అంతకు ముందు నుండే పరీక్ష హాలు బయట ఆమె బంధువులు ఉండి విద్యార్థిని ని తీసుకుపో వడాన్ని గమనించిన తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular