కరీంనగర్ : ఫిబ్రవరి (నిఘా న్యూస్) తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు బరిలో బిజెపి కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటే ఈసారి ఎక్కువగా పట్టభద్రులపై దృష్టి సారిస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థిగా నరేందర్ రెడ్డి తనదైన స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు ఇటు కాంగ్రెస్ అండతో పాటు తన వ్యక్తిగత పరిచయాలతో పట్టబద్రు లకు సుపరిచితుడుగా ఉండడం ఇటు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా నరేందర్ రెడ్డి కి కలిసి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి విద్యావేత్త గా ఆల్ ఫోర్స్ కళాశాలల ఫీజులలో ఇతర కళాశాలల కంటే కొంచెం తక్కువ ఫీజులు తీసుకుంటారని పేరు కూడా ఉంది మరియు వివిధ రాజకీయ నాయకులతో పాటు స్థానిక విద్యావేత్తలతో ఆయనకున్న పరిచయాలు ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఊహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది రాజకీయాలకు అతీతంగా కూడా నరేందర్ రెడ్డి పట్టభద్రులతో సంబంధాలు ఏర్పరచు కోవడం పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగి ఉండడం నిరుద్యోగ యువతకు ఒక నమ్మకం కలిగించేలా ఆయన వ్యవహార శైలి వ్యక్తిగత జీవితం విజయానికి దగ్గర చేస్తున్నట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి ఎలాగైనా బిజెపి. స్వతంత్ర అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధించాలని చూస్తున్నారు ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
విజయం తనదే అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
RELATED ARTICLES