కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు సవాల్ విసిరాడు. మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలపెట్టమంటూ పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కరీంగనర్ లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మళ్లి అధికారంలోకి వస్తే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరినీ వదిలిపెట్టమంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొందరు పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో విభిన్న వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారిన కౌశిక్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు
పోలీసులకు సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
RELATED ARTICLES