Sunday, August 3, 2025

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా నేటి నుంచి మిస్​ వరల్డ్​ పోటీలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ఖ్యాతిని ప్రపం చానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా మిస్ వరల్డ్ పోటీ లకు సర్కార్‌ ఘనమైన ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడి యంలోఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్నాయి,ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖు లు పాల్గొననున్నారు.

120 దేశాల అందమైన భామలు పోటీపడుతున్న వేడుకలను వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కారు అవకాశం కల్పించింది.72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమిస్తోం ది. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్నందున ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది.

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం ప్రపంచసుందరి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించను న్నారు. 120 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో పరేడ్ చేయనున్నారు. ఈ వేడు కల్లో తెలంగాణ ప్రత్యేకమైన పేరిణి, గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్ష ణగా నిలవనున్నాయి.

గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకకు 3 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 108 దేశాల నుంచి అందగత్తెలు రాష్ట్రానికి చేరుకోగా, ఈ మధ్యాహ్నా నికి మిగతా వారు చేరుకుం టారని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యం!

తెలంగాణలో సుందర పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి,సర్కార్‌ నిర్వహిస్తోంది. చారిత్రక ప్రదేశాలు, సంప్ర దాయ కళలు, యునెస్కో గుర్తించిన సంపదను మిస్ వరల్డ్ పోటీదారులకు చూపనుంది.

బుద్ధవనం, నాగార్జున సాగర్, వరంగల్ కోట, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, యాదగిరి గుట్టను చుట్టొచ్చేలా ప్రణా ళిక వేశారు. చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్‌తో పాటు పోచం పల్లి ఇక్కత్ డిజైన్లను వివిధ దేశాలసుందరీమణులు సందర్శించనున్నారు.

పౌరుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు వివరించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి, మెడికల్ టూరిజంలో భాగంగా ఏఐ జీ ఆస్పత్రిని అందాల భామలకు చూపనున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular